పంచాయతీలలో స్వచ్ఛభారత్ అమలు చేయండి..

by Kalyani |
పంచాయతీలలో స్వచ్ఛభారత్ అమలు చేయండి..
X

దిశ, కాటారం: పంచాయతీలలో స్వచ్ఛభారత్ పూర్తిగా అమలు చేయాలని కాటారం మండల పరిషత్ అధ్యక్షుడు పంతకాని సమ్మయ్య అన్నారు. సోమవారం స్వచ్ఛభారత్ మిషన్ రెండవ దశ అమలుపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సమ్మయ్య ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదటి రోజు సోమవారం స్వచ్ఛ భారత్ మిషన్ రెండవ దశలో చేయవలసిన వివిధ రకాల కార్యక్రమాలు అనగా ఓడిఎఫ్ సుస్థిరత, తడి చెత్త, పొడి చెత్త నిర్వహణ వ్యర్థ నీరు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ మెలకువల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ కోఆర్డినేటర్ మంద వెంకటేష్ వివరించారు.

గ్రామ పంచాయతీలో చేయాల్సిన శానిటేషన్ ప్లాన్ గురించి భాస్కర్ రెడ్డి వివరించారు. రెండవ రోజు గ్రామ సందర్శన, గ్రామ సానిటేషన్ ప్లాన్, ఇంకుడు గుంత, మరుగుదొడ్డి గురించి టెక్నికల్ ట్రైనింగ్ పై శిక్షణ ఇవ్వనున్నారు. మూడవరోజు గ్రామపంచాయతీ శానిటేషన్ ప్లాన్ తయారు చేసి మండలంలో సమర్పించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారి ఉపేంద్రయ్య, ఉపాధి హామీ ఏపీఓ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed