- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రగ్స్ వాడితే జైలే.. ఏఎస్పీ హెచ్చరిక
దిశ, మంగపేట : యువత డ్రగ్స్ కు అలవాటు పడితే జీవితాలు కోల్పోతారని డ్రగ్స్ వాడిన యువతకు 2 సంవత్సరాల శిక్ష తప్పదని ఏటూరునాగారం సబ్ డివిజన్ ఏఎస్పీ శివం ఉపాద్యాయ అన్నారు. గురువారం హోప్ ఎన్జీవో, జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించిన ‘ సే నోటూ డ్రగ్స్’ 2కె రన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. 2కె రన్ లో మండలంలోని సుమారు 2 వందల మంది యువత పాల్గొని కాలేజీ నుండి గంపోనిగూడెం, కోమటిపల్లి క్రాస్ మీదుగా వైఎస్ఆర్ సెంటర్ నుండి కాలేజీ వరకు రన్ నిర్వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఏఎస్పీ శివం ఉపాద్యాయ మాట్లాడుతూ యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలన్నారు. మండలంలో ఎక్కడైనా యువత, ప్రజలు డ్రగ్స్, గంజాయి, వంటి మత్తు పదార్థాలకు వాడినట్లు మీ దృష్టికి వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో ఏటూరునాగారం సీఐ శ్రీనివాస్, ఎస్సై టీవీఆర్ సూరి, ఎస్సై సురేష్, హోప్ ఎన్జీవో ప్రతినిధులు ఎస్డీ.ఖలీద్, కబ్బాక శ్రావన్ కుమార్, ఫయాజ్, మినహాజ్ హుస్సేన్, సాయి కిరన్, రహ్మత్, సుమన్, రవితేజ, ప్రశాంత్, మౌనిక, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.