- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ మాయమాటలు నమ్మితే మోసపోయి గోసపడతాం : బడే నాగజ్యోతి
దిశ,ములుగు ప్రతినిధి: కాంగ్రెస్ మాటలు నమ్మితే మోసపోయి గోస పడతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. 6గ్యారెంటీ ల పేరుతో వస్తున్న నేతలు పక్క రాష్ట్రం చత్తీస్గడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ....అదే గ్యారెంటీలు అమలు చేయడం లేదని, ఇలాంటి వారు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తానంటే నమ్మేది ఎలా అని ఆమె ప్రశ్నించారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమని, ములుగులో అడ్డంకిగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేని గద్దె దించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. బుధవారం వెంకటాపూర్ లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బడే నాగజ్యోతి మాట్లాడుతూ 20 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన ధనసరి అనసూయ ములుగు నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. ప్రజల కష్టసుఖాల్లో తోడు ఉంటానని తన తుది శ్వాస వరకు ప్రజా సంక్షేమం కోసం పని చేస్తానని అన్నారు.
మలుగు ఎన్నికల ఇంచార్జ్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ములుగు ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క కరోనా సమయంలో హైదరాబాద్ నుంచి మూటలు తెప్పించి కెమెరాల ముందు మూటలు మోస్తూ చత్తీస్గడ్ ప్రజలకు పంచిందే తప్ప ములుగు ప్రజలకు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. గ్రావిటీ కెనాల్ ద్వారా నీళ్లు రప్పించి వెంకటాపూర్ లో పది వేల ఎకరాల భూమిని సస్యశ్యామలం చేయనున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి విజయం సాధించగానే వెంకటాపూర్ పట్టణంలో ఫంక్షన్ హాల్ నిర్మించి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ ఎన్నికల ఇంచార్జ్ సాంబారి సమ్మారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిగ గోవింద నాయక్, వెంకటాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు ఇనుగాల రమణారెడ్డి, రమా జగదీష్, స్థానిక పార్టీ నేతలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.