- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంథనిలో కాంగ్రెస్ దే హవా.. విజేత నిర్ణయం మహిళల దే..
దిశ, కాటారం : ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన పోలింగ్ ముగిసింది. ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యాన్ని ఆదివారం ఓట్ల లెక్కింపులో తేలనుంది. శాసనసభకు జరిగిన ఎన్నికలలో మంథని సెగ్మెంట్లో విజేతను నిర్ణయించడంలో మహిళలు కీలక భూమిక పోషించనున్నారు. నియోజకవర్గంలో 288 పోలింగ్ స్టేషన్లలో గురువారం జరిగిన పోలింగ్లో 82.74 శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలోని 10 మండలాల్లో 2,36,442 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,95,635 మంది ఓటు వేశారు. 1,19,716 మంది మహళ ఓటర్లలో 98,565 మహిళలు తమ ఓటు వేశారు. పురుషులలో 1,16,707 మంది ఉండగా, 97,061 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలైన ఓట్లలో పురుషుల కంటే మహిళలు 1501 ఎక్కువగా ఓట్లు వేశారు. అభ్యర్థుల గెలుపు పై మహిళల ఓటింగ్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. 2018 శాసనసభ ఎన్నికలలో 85.41 పోలింగ్ శాతం నమోదు కాగా, ఇప్పుడు జరిగిన ఎన్నికలలో పోలింగ్ శాతం 82.74 శాతం పోలింగ్ జరిగింది. గత ఎన్నికల కంటే 2.67 శాతం తక్కవగా నమోదయింది.
ఎవరికి వారే అంచనాలు వేస్తూ..
మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దుదిల్ల శ్రీధర్ బాబు గెలుస్తారని అంతట మౌత్ టాక్ వినిపిస్తోంది. అన్ని పార్టీలు శ్రీధర్ బాబు గెలుస్తారని చెబుతున్నప్పటికీ ఎంత మెజార్టీ వస్తుందో మండలాల వారీగా అంచనా వేస్తున్నారు. ప్రధాన పార్టీలు పోలింగ్ సరళిని పరిశీలించి అంచనా వేస్తున్నారు. అయితే మండలాల వారీగా మన పార్టీ పరిస్థితి ఎట్లుంది ఓట్లు ఎంత శాతం వేసి ఉండొచ్చు అంటూ స్థానిక నాయకులకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆయా వర్గాల ఓటర్లతో మాట్లాడి వాస్తవ పరిస్థితిని కోరుతున్నారు. తద్వారా మూడవ తేదీ లోపు గెలుపు అవకాశాల పై ఒక అంచనాకు రావచ్చనే ఆలోచనతో అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి శ్రీధర్ బాబు గెలుస్తున్నారని, మెజారిటీ 20 నుండి 30 వేల వరకు రావచ్చునని, కౌంటింగ్ కు ముందే కాంగ్రెస్ శ్రేణులు, వ్యాపార వర్గాలు, అధికారులు, కులసంఘాల నేతలు అందరూ ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఓట్లు చేజారాయనే చర్చ
ఎన్నికల ప్రక్రియలో పోల్ మేనేజ్మెంట్ కు ఉన్న ప్రాధాన్యం తెలిసిందే. ఆయా గ్రామాల్లో పట్టున్న నాయకులను ముందుంచి పనిచేయడం ద్వారా పార్టీకి బలం చేకూరడంతో పాటు ఓట్లు వస్తాయి. అయితే ఓటర్లను పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నాలు సరిగా సాగలేదనే చర్చ, ముఖ్యంగా మంథని నియోజకవర్గంలో ఈసారి శ్రీధర్ బాబు గెలుపు ఖాయం అని చెబితేనే ఎంత మేరకు మెజార్టీ వస్తుందోనని బెట్టింగులు జోరుగా జరుగుతున్నాయి.