ఏజెన్సీలో హై అలర్ట్

by Kalyani |
ఏజెన్సీలో హై అలర్ట్
X

దిశ, కొత్తగూడ : ఏజెన్సీ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకపోవడం మంచిదని, పులి కనబడితే తమకు సమాచారం అందించాలని కొత్తగూడ మండల అటవీ శాఖ అధికారి వజహాత్ అన్నారు. పులి సంచారం నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ప్రత్యేక బృందాలు ఏర్పడి అడవిని జల్లెడ పడుతున్నారు. పులి తారసపడి దాడికి పాల్పడుతుందని ముందస్తుగా బృందాలుగా ఏర్పడి వారి ఆత్మ రక్షణ కోసం స్వల్ప ఆయుధాలను వేసుకొని అడవిని గాలిస్తున్నారు. కోనపురం ప్రాంత అడవుల్లో పులి అడుగుల ఆనవాలు వగైరా గుర్తులను సంచరిస్తున్న దృశ్యాలను బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ సమయంలో ఆడ పులి గురించి అన్వేషణలో పయనిస్తుందని తను సంచరిస్తున్న ప్రదేశాలలో వృక్షాలకు ట్రాప్ కెమెరాలను అమర్చారు. ముఖ్యంగా పులి పాదముద్రలు కనుగొన్న ప్రాంతంతో పాటు మరికొన్ని చోట్ల వీటిని అమర్చి పులి సంచారం పై నిఘా పెట్టారు. పులి సంచారం హెచ్చరికలను జారీ చేస్తూ రైతులు ఒంటరిగా పొలాల్లోకి వెళ్లవద్దని, పశువులను జాగ్రత్తగా చూసుకోవాలని స్పష్టం చేస్తూ తిమ్మాపురం, ఆదిలక్ష్మిపురం, ఎంచగూడెం, కోనాపూర్, ఓటాయి ,సాదిరెడ్డిపల్లి అటవీ ప్రాంతాల్లో డిఆర్ఓ కరుణ, సెక్షన్ ఆఫీసర్లు రాజేష్, పద్మారావు, లతో కలిసి పులి కదలికలపై క్షుణ్ణంగా పరిశీలిస్తూ అటవీ శాఖ అధికారులు హై అలర్ట్ అయ్యారు.

ప్రజలు భయాందోళన

పులులు ప్రతి ఎనిమిది నెలలకు ఒక్కసారి సంపర్కం (సంభోగం) చెందుతాయి. అదే క్రమంలో గత మూడు నెలల నుంచి గోదావరి పరివాహక ప్రాంతం నుండి క్రమ క్రమంగా సంచరిస్తూ ఏటూరునాగారం, ములుగు అడవుల్లో సంచరిస్తూ హల్ చల్ చేస్తున్న పులి గత రెండు సంవత్సరాలుగా సంచరిస్తున్న పులి ఒక్కటిగా భావిస్తున్నారు. తాజాగా నల్లబెల్లి రుద్రగూడెం అడవుల నుంచి కొత్తగూడ ప్రవేశించిన పులిని కొత్తగూడ అటవీశాఖ అధికారులు పులి అడుగుల ఆనవాలు గుర్తించి మగ పులిగా నిర్దారించారు. గత రెండు సంవత్సరాలుగా సంచరిస్తున్న పులి ప్రస్తుతం సంచరిస్తున్న పులి రెండు ఒక్కటే అని అంటున్నారు. సాధరణంగా పులులు ఆడ మగ కలియ తిరుగుతూ ఉంటాయి. కొంత జాప్యం వచ్చినా తమ పనిలో తాము ఉంటాయి. ప్రత్యేకంగా సంభోగం సమయంలో కనిపించకపోతే ఆడ పులి తోడు గురించి అన్వేషణలో సంచరిస్తుందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed