- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోండి..
దిశ, వేలేరు: అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఇంచార్జి పడమటి జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం వేలేరు మండలంలోని షోడాషపల్లి, పీచర, మద్దెలగూడెం గ్రామాల్లో బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు పర్యటించి వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల అకాల వర్షాలతో రైతులకు ఇప్పుడు బీమా అందకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతు పక్షపాత ప్రభుత్వంగా నిలిచిందని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్రంలోని 119 నియోజకవర్గంల్లో బీజేపీ ప్రతినిధులు పంటనష్టంపై వివరాలు సేకరించి ఉగాది తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులకు పంట నష్టం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు, నిరసనలు తెలుపుతామని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కాట్రేవుల రాజు, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు పుల్యాల రవీందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గండు సారయ్య, ధర్మసాగర్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు మీరాల ఆశోక్, బీజేపీ నాయకులు మాలోతు రాజు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.