రోడ్డుపై బైఠాయించిన గూడూరు రైతులు

by Hamsa |
రోడ్డుపై బైఠాయించిన గూడూరు రైతులు
X

దిశ, దేవరుప్పుల(పాలకుర్తి): ఆరుగాలం కష్టించి పండించిన పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే కొనుగోలు కేంద్రాన్ని నడుపుతున్న నిర్వాహకులు తాలు మట్టి పేరుతో 40 కిలో బస్తాకు మూడు కిలోలు కట్ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన సంఘటన పాలకుర్తి మండలంలోని గూడూరు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలోని ఐకేపీ సెంటర్లో వడ్లు అమ్మకాని తీసుకెళ్తే 40 కేజీల బస్తాకు తాలు పేరుతో 2 కేజీలు. మట్టి పేరుతో 1కేజీ వడ్లను కట్ చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మ్యాచర్ తక్కువ ఉందని ఇబ్బంది పెడుతున్నారని రైతుల ఆందోళన వ్యక్తపరుస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని చెప్పగా గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని నడుపుతున్న బాధ్యులు రైతులను ఇబ్బందులు పెట్టే చర్యలు దిగుతున్నారని వెంటనే వారిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికే అకాల వర్షాలతో పంట నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన తమకు ఇంకా మనోవేదన గురి చేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.

Advertisement

Next Story