- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంకా ప్రారంభం కాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు
దిశ,పలిమెల : వరి కోతలు ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా నేటికీ పలిమెల మండలంలో కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ధాన్యం కొనుగోలు విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో విక్రయదారులు తక్కువ ధరకు విక్రయాలు జరుపుతున్నారు. ఏ ఒక్క కొనుగోలు కేంద్రంలోనూ ఇంతవరకు వడ్ల కొనుగోలు ప్రారంభం కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో రైతులు వడ్ల కుప్పలు పోసి రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాల వల్ల మండలంలో పలు చోట్ల వరి నెల పలైన తడిసిపోయాయి. చాలా చోట్ల కోతకు వచ్చిన పంట వర్షాల వల్ల నీళ్ల పాలైంది. ఆరుగాలం పండించిన పంటను కాపాడుకోవడం ఒక ఎత్తయితే.. చేతికొచ్చిన పంటను అమ్ముకోవడం తలకు మించిన భారంగా మారిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విసిగిపోయి వడ్లను మిల్లర్లకు అమ్ముకునేలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్షణమే వడ్ల కొనుగోళ్లను ప్రారంభించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.