ఈటలను పరామర్శించిన Governor Tamilisai

by S Gopi |   ( Updated:2022-08-25 11:27:34.0  )
ఈటలను పరామర్శించిన Governor Tamilisai
X

దిశ, కమలాపూర్: మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా గురువారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ఆయన నివాసంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ఈటల రాజేందర్ ను పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ జేశారు.

ఈటలను పరామర్శించిన రాజకీయ, వివిధ పార్టీల నాయకులు మరియు ప్రముఖులు

హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, సినీనటి జీవితా రాజశేఖర్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, బీజేపీ ఎస్టీ మెర్చా రాష్ట్ర అధ్యక్షులు జాటోత్ హుస్సేన్ నాయక్, ఉపాధ్యక్షులు నాను నాయక్, కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవీ రావు, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, నాయకులు గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు రావు పద్మ, ఎన్ఎస్ యూఐ నాయకులు బలుమూరు వెంకట్ ఈటలను పరామర్శించారు. ఈటల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈటెల మల్లయ్య చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.



Advertisement

Next Story