పొద్మూరు ఆవాసాల్లోకి గోదావరి వరద

by Sridhar Babu |
పొద్మూరు ఆవాసాల్లోకి గోదావరి వరద
X

దిశ, మంగపేట : గోదావరి ఎగువ నుండి వరద పెరగడంతో మంగపేట వద్ద గౌరారం వాగు నుండి పొద్మూరులోని లోతట్టు ప్రాంతాలకు చేరింది. దాంతో మంగళవారం అర్దరాత్రి నుండి ఎంపీడీఓ భద్రు, ఎస్సై టీవీఆర్ సూరి, డిప్యూటీ తహసీల్దార్ మల్లేశ్వరరావు, మంగపేట పంచాయతీ కార్యదర్శి సురేష్ తదితరులు బాధితులను పునరావాస కేంద్రానికి తరలించారు. గౌరారం వాగు లోతట్టులోని పొద్మూరు, ముస్లింవాడకు చెందిన సుమారు 50 కుటుంబాలను మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించినట్లు తెలిపారు.

Advertisement

Next Story