అర్ధరాత్రి మాజీ ఐఏఎస్ అధికారి Akunuri Murali అరెస్ట్.. విడుదల

by Mahesh |   ( Updated:2023-01-31 05:50:46.0  )
అర్ధరాత్రి మాజీ ఐఏఎస్ అధికారి Akunuri Murali అరెస్ట్.. విడుదల
X

దిశ, హన్మకొండ: మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని అర్ధరాత్రి దాటిన తర్వాత హన్మకొండ జిల్లా సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం తెల్లవారు జామున వదిలేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని జిల్లా కేంద్రంలో బాధితులతో ధర్నా నిర్వహించారు.

ఈ సందర్బంగా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించి వదిలేశారు. అక్కడినుండి హన్మకొండ జిల్లా కేంద్రం కు చేరుకున్నారు. అక్కడ ఉన్న తెలంగాణ ఉద్యమ కారుడు వాక్యత జర్నలిస్ట్ పృద్వి రాజ్‌తో కలసి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్ డ్రమ్ బాధితులను కలుసుకొని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం బాధితులతో కలిసి డబల్ బెడ్ డ్రమ్ ఇండ్లు పరిశీలించి బాధితుల గుడిసెల్లో బస చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు తెల్లవారుజాము 3 గంటల 30 నిమిషాలకు అక్రమంగా డబుల్ బెడ్ డ్రమ్‌లోకి ప్రవేశించారంటూ మాజీ కలెక్టర్‌తో పాటు ఉద్యమ కారులని అరెస్ట్ చేసిన పోలీసులు సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించి అనంతరం వదిలేశారు.

Also Read...

పోలీసుల నోటీసులు.. Rajasingh సంచలన వ్యాఖ్యలు!

Advertisement

Next Story