Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీ కి తగ్గుముఖం పట్టిన వరద ప్రవాహం

by Aamani |
Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీ కి తగ్గుముఖం పట్టిన వరద ప్రవాహం
X

దిశ,కాటారం : భారీ వర్షాల కారణంగా రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి నది మంగళవారం కాళేశ్వరంలో త్రివేణి సంగమం వద్ద, మేడిగడ్డ ప్రాజెక్టుల వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. కాలేశ్వరం పథకం లో భాగంగా ఉన్న మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ లో మంగళవారం సాయంత్రం 6 గంటల కు 7,71,580 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. కాలేశ్వరంలో గోదావరి నది కి వరద ఉధృతి ఉదయం నుండే తగ్గుతోంది. కాలేశ్వరంలో పుష్కర ఘాట్ వద్ద సాయంత్రం ఐదు గంటలకు గోదావరి వరద ప్రవాహం 102.750 మీటర్లు గా ఉంది. అన్నారంలోని సరస్వతి బ్యారేజీలో సాయంత్రం వరకు 16,500 క్యూసెక్కుల వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. మంగళవారం భారీ వర్షాలు లేక ముసురు మాత్రమే ఉండడంతో గోదావరికి వరద ముప్పు ప్రమాదం తొలగిపోవడంతో తీర ప్రాంతాల గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed