గుడిమహేశ్వరంలో ఓటర్ల డిమాండ్‌తో ఫ్లెక్సీ

by Disha Web Desk 12 |
గుడిమహేశ్వరంలో ఓటర్ల డిమాండ్‌తో ఫ్లెక్సీ
X

దిశ, దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని గుడి మహేశ్వరం గ్రామంలో ఓటర్ల పేరుతో వెలిసిన ఫ్లెక్సీ వాట్సాప్‌లో వైరల్ అవుతుంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వచ్చే రాజకీయ పార్టీలు, నాయకులను ఆలోచింప చేస్తుంది. ఉచిత పథకాలు, గ్యారెంటీలు ప్రకటించిన పార్టీలకు ఇది చెంపపెట్టు అని ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా ఈ ఫ్లెక్సీలో పనికిమాలిన ఉచిత పథకాలు వద్దని, దేశ భద్రత కావాలని, దేశ భద్రత కోసం సీఏఏ, ఎన్‌ఆర్‌సీ అమలు చేయాలని, సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు, హిందూ ఆలయాల రక్షణ కోసం హిందూ ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలని, బలవంతపు మత మార్పిడి నిరోధక చట్టం కావాలని, అన్నదాతల ఆత్మహత్యలు లేని వ్యవసాయ విధానాలు రావాలని, గోవధ నిషేధ చట్టం తేవాలని రాసి ఉన్న ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇలా అన్ని గ్రామాలలో ఓటర్లు ఐకమత్యమైతే చాలా బాగుండేదని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు చక్కర్లు కొడుతున్నాయి.



Next Story