- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాంచీలో ఈడీ దాడులు..భారీగా నోట్ల కట్టలు స్వాధీనం
దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ రాజధాని రాంచీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం దాడులు చేపట్టింది. ఇంజనీర్లు, రాజకీయ నాయకులకు సంబంధించిన సుమారు 9 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఆలంగీర్ ఆలం పీఏ సంజీవ్ లాల్ నౌకర్ ఇంట్లో భారీగా నగదు స్వాధీనం చేసుకుంది. దీని విలువ సుమారు రూ.30కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. నోట్లను లెక్కించేందుకు కౌంటింగ్ యంత్రాలను తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో కొన్ని పథకాల అమలులో అవకతవకలు జరగడంతో మనీ లాండరింగ్ కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో గతేడాది ఫిబ్రవరిలో ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్‌ను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే మరోసారి ఈడీ దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది. ధ్రువలోని సెల్ సిటీ ప్రాంతం, బోడెయ మోర్హబడి రోడ్‌లో సోదాలు కొనసాగుతున్నట్టు సమాచారం. కాగా, 2022 ఫిబ్రవరిలోనూ వీరేంద్రకు చెందిన 24 ప్రదేశాలపై ఈడీ దాడులు చేసింది. ఈ క్రమంలో ఆయన సన్నిహితులకు సంబంధించిన రూ.100 కోట్ల ఆస్తులను గుర్తించారు. అంతేగాక రూ.1.5 కోట్ల విలువైన ఆభరణాలు, సుమారు రూ.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.