మారిన నీట్ ప్రశ్నాపత్రం.. విద్యార్థుల తల్లిదండ్రుల కీలక నిర్ణయం

by Disha Web Desk 4 |
మారిన నీట్ ప్రశ్నాపత్రం.. విద్యార్థుల తల్లిదండ్రుల కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) పరీక్ష నిన్న దేశవ్యాప్తంగా జరిగింది. అయితే ఆసిఫాబాద్ లో నిన్ననటి నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రం మారడం తీవ్ర కలకలం రేపింది. అభ్యర్థులకు ఇవ్వాల్సిన సెట్‌కు బదులు మరో సెట్ ను నిర్వాహకులు ఇచ్చారు. పరీక్ష అనంతరం ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తించడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారులకు సమాచార లోపంతో ప్రశ్నాపత్రం మార్పు అయినట్లు తెలుస్తోంది. ఆసిఫాబాద్ మోడల్ స్కూల్‌లో మొత్తం 299 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. పరీక్ష ప్రశ్నాపత్రం మారడంతో ఆసిఫాబాద్ కలెక్టర్‌ను కలిసే యోచనలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed