ఉదయం 8 గంటలకు టిఫిన్ చేయడం లేదా.. అయితే ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు!

by Jakkula Samataha |
ఉదయం 8 గంటలకు టిఫిన్ చేయడం లేదా.. అయితే ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు!
X

దిశ, ఫీచర్స్ : ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అందుకే ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం టైమ్‌కి తినడం, వ్యాయామం చేయడం లాంటివి చేయాలి. కానీ కొంతమంది టిఫిన్ చేయడంలో చాలా ఆలస్యం చేస్తుంటారు. మారిన జీవనశైలి, ఉరుకుల పరుగుల జీవితం, ఆఫీసుకు త్వరగా వెళ్లాలని ఆరాటం, ఆఫీసు వర్క్ బిజీ వీటన్నింటి వలన చాలా మంది టిఫిన్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కానీ ఇది వారి ప్రాణానికే ప్రమాదం అని గుర్తించడంలో విఫలం అవుతున్నారు.

తాజాగా చేసిన న్యూ స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి అయ్యాయి. ఉదయం ఎనిమిది గంటలకు టిఫిన్ చేయకపోతే హార్ట్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నదంట. అందువలన ఉదయం 8 గంటలకు అల్పాహారం, రాత్రి 8 గంటలకు చివరి భోజనం తినడాన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి అంటున్నారు ఫ్రాన్స్‌లోని వర్సిటీ సోర్బన్ ప్యారిస్ నోర్డ్ వైద్యులు. ఉదయం ఎనిమిది గంటలకే తినే వారికంటే ,9 గంటలకు తినే వారిలో హార్ట్ సమస్యలు వచ్చే అవకాశం ఆరు శాతం ఎక్కువగా ఉందని వారు తెలిపారు. రాత్రి ఎనిమిది గంటలకు బదులుగా తొమ్మిదిగంటలకు తినడం వలన మహిళల్లో స్ట్రోక్ వంటి సెరెబ్రోవాస్కులర్ వ్యాధి వచ్చే ప్రమాదం 28 శాతం పెరుగుతోందని వారు గుర్తించారు. అందువలన తప్పనిసరిగా ఫుడ్ తీసుకోవడంలో నెగ్లెట్ చేయకూడు అంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story