ఫోర్న్ సైట్‌లో జాన్వీకపూర్ ఫోటోలు.. నాకు ఏం తెలియదంటూ ఎమోషనల్!

by Jakkula Samataha |   ( Updated:2024-05-19 12:58:58.0  )
ఫోర్న్ సైట్‌లో జాన్వీకపూర్ ఫోటోలు.. నాకు ఏం తెలియదంటూ ఎమోషనల్!
X

దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ జాన్వీకపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈమె సొంతం. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ అందరినీ మాయచేస్తోంది. ఇక ప్రస్తుం ఈ నటి తెలుగులో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కొరటాల శివ, దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తుంది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. చిత్రిపరిశ్రమకు చెందిన శ్రీదేవి, బోనీ కపూర్ కూమార్తెను అయినప్పటికీ తనను అవమానించకుండా ఉండలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. జాన్వీ రాజ్ కుమార్ రావు నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే చిత్రం ఈ మంత్ ఎండింగ్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో భాగంగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ, 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తన ఫోటోలని ఫోర్న్ సైట్‌లో పెట్టి దుష్ప్రచారం చేశారంటూ చెప్పుకొచ్చింది. కొందరు ఆకతాయిలు నా ఫోటోలని పోర్న్ సైట్ లో పెట్టారు. శ్రీదేవి కూతురు ఎంత అసభ్యంగా ఉందో చూడండి అంటూ వైరల్ చేశారు. ఆ ఫోటోలని నా ఫ్రెండ్స్ కూడా చూశారు. నేను స్కూల్ కి వెళితే ఎంతో అవహేళనగా మాట్లాడారు. ఆ వయసులో వాటి గురించి నాకు అవగాహన కూడా లేదు. నన్ను ఎందుకు ఎగతాళి చేస్తున్నారో, ట్రోల్ చేస్తున్నారో అర్థం అయ్యేది కాదు, ఎమోషనల్ కూడా అయ్యాను వారి మాటలకు. అప్పటి విమర్శలు, ట్రోలింగ్ వల్లనే నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురు అవుతే నేను భరించగలుగుతాను, కానీ నా ఫ్యామిలీని ట్రోల్ చేస్తే మాత్రం సహించలేనంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed