- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాడు గుజరాత్ జీరో.. నేడు ఆర్సీబీకి జట్టుకు హీరో
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024లో మొదట్లో అత్యంత పేలవంగా జట్టుగా పేరుగాంచిన ఆర్సీబీ జట్టు ఎవరు ఊహించని విధంగా పుంజుకుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న హైదరాబాద్ జట్టుపై రెండో విజయాన్ని అందుకున్న తర్వాత.. వరుసగా ఆరు మ్యాచ్ లో గెలిచి ఏకంగా ప్లే ఆఫ్ చేరుకుంది. ఓ దశలో ఆర్సీబీ పనైపోయిందని అందరూ అనుకున్నప్పటికీ 17 సీజన్లుగా కప్పు కొట్టాలనే కల నెరవేర్చుకోవడం కోసం ఆర్సీబీ మరో ముందడుగు వేసింది. శనివారం చెన్నై జట్టుతో జరిగిన అత్యంత కీలకమైన మ్యాచులో ఆర్సీబీ 27 పరుగుల తేడాతో గెలిచి.. నెట్ రన్ రేట్ సాయంతో ప్లే ఆఫ్ చేరిన నాలుగో జట్టుగా మిగిలింది. కాగా ఈ విజయంలో ఆర్సీబీ బౌలర్ యస్ దయాల్ హీరోగా మారాడు.
చివరి ఓవర్లో చెన్నై క్వాలిఫై అవ్వడానికి 17 పరుగులు చేయాల్సి ఉండగా.. క్రీజులో ఉన్న ధోనిని అవుట్ చేసి కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. గత సీజన్లో దయాల్ గుజరాత్ జట్టు తరఫున ఆడాడు 2022 సీజన్ లో ఆ జట్టు కప్పు కొట్టడం లో కీలక పాత్ర పోషించాడు. అయితే 2023లో కలకత్తా జరిగిన ఓ కీలక మ్యాచ్ లో ఒకే ఓవర్ లో 32 పరుగులు ఇచ్చి కీలక మ్యాచ్ ఓటమికి కారకుడయ్యాడు. దీంతో ఆ జట్టు అతన్ని మినీ వేలంలో బయటకు వదిలేసింది. కానీ నేటి మ్యాచులో క్రీజులో ఉన్న ధోనిని అవుట్ చేయడంలో ఓ వైపు జడేజా లాంటి భారీ హిట్టర్ క్రీజులో ఉన్నప్పటికీ కేవలం 7 పరుగులు మాత్రమే ఇవ్వడంతో యశ్ దయాల్ ఆర్సీబీ.. జట్టుతో పాటు కోహ్లీ ఫ్యాన్స్ కు కూడా హీరోగా నిలిచాడనడంతో ఎటువంటి అతిశయోక్తి లేదు.