MLA : పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

by Kalyani |
MLA : పత్తి  కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
X

దిశ, రాయపర్తి : రైతులు తాము పండించిన పంటలను దళారుల చేతిలో అమ్ముకొని మోసపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, ఈ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని గిట్టుబాటు ధర పొందాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కిష్టాపురం క్రా,స్ రోడ్ వద్ద ఉన్న హరి చందన మొరిపిరాల క్రాస్ రోడ్డు వద్ద ఉన్న భాగ్యలక్ష్మి కాటన్ మిల్లులలో సీసీఐ ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాలను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రైతులు సీసీఐ ద్వారా ఏర్పాటు చేసిన పత్తి మిల్లులో నిబంధనలకు లోబడి పత్తిని అమ్ముకొని క్వింటాల్ కు ₹7,521 గిట్టుబాటు ధర పొందాలన్నారు. రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు తోడుగా ఉంటుందన్నారు. రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదన్నారు.

అలాగే మండలంలోని తిరుమలయ పల్లి, గట్టికల్, జగన్నాధపల్లి, సన్నూ గ్రామాలలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సన్నరకం వారి ధాన్యానికి ప్రభుత్వం క్వింటాలుకు 500 రూపాయలను బోనస్ గా ప్రభుత్వం అందిస్తుంది అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకొని ధాన్యాన్ని ఆరబోసుకొని నిబంధనలకు లోబడి సరి అయిన తేమ శాతాన్ని చూపించి రైతులు ధాన్యాన్ని అమ్ముకోవాలన్నారు. రైతులకు అన్ని మౌలిక వసతులు కల్పించాలని నిర్వాహకులను ఆదేశించారు.

వచ్చే సంవత్సరం జనవరి నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు సన్నబియాన్ని అందిస్తుందని అన్నారు. సన్న బియ్యం ఇవ్వడం వలన ఎలాంటి అవకతవకలు జరగవు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో కిషన్, ఏపిఎం కిరణ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హ్యామ్య నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, పాలకుర్తి దేవస్థానం చైర్మన్ కృష్ణమాచార్యులు, నాయకులు మాచర్ల ప్రభాకర్ కృష్ణారెడ్డి, పెండ్లి మహేందర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ముద్రబోయిన వెంకటేశ్వర్లు, వనజ రాణి, రేవూరి వెంకన్న, గోపాల్ రెడ్డి, నరసయ్య, శ్రీనివాస్ రెడ్డి, యాకూబ్ రెడ్డి, కుమారస్వామి ఐకెపి సిబ్బంది, సీసీఐ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story