- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నర్సంపేట వ్యవసాయ మార్కెట్ గేటుకు తాళం వేసిన రైతులు..
దిశ, నర్సంపేట: దళారుల మోసంతో ఆగ్రహానికి గురైన బాధిత రైతులు వ్యవసాయ మార్కెట్ గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేస్తున్న సంఘటన నర్సంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లో చోటుచేసుకుంది. బాధిత రైతుల కథనం ప్రకారం.. క్వింటాల్ మొక్కజొన్నకు మొన్నటి వరకు రూ.2200 ధర చెల్లించినట్లు తెలిపారు. బుధవారం మార్కెట్ కి సెలవు రోజు కావడంతో గురువారం మార్కెట్ కి మొక్కజొన్న ఎక్కువ మొత్తంలో చేరింది. ఇది అదనుగా భావించిన దళారులు రేటును తగ్గించినట్లు బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గురువారం రూ.1975 కి క్వింటాల్ మొక్కజొన్నకి ఖరీదు పెట్టడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే సమాధానం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే విసిగిపోయిన రైతులు వ్యవసాయ మార్కెట్ గేటుకు తాళం వేశారు. లారీలను సైతం కదలనివ్వకుండా చేశారు. అధికారులు ఇకనైనా స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.