ప్ర‌జాస్వామ్యం గొంతు నొక్కుతున్న ప్ర‌భుత్వం..నాయిని రాజేందర్ రెడ్డి

by Sumithra |
ప్ర‌జాస్వామ్యం గొంతు నొక్కుతున్న ప్ర‌భుత్వం..నాయిని రాజేందర్ రెడ్డి
X

దిశ‌, హ‌న్మ‌కొండ టౌన్ : వరంగల్ జిల్లా కేంద్రంలో పలుశంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖా మంత్రి కే.టి.ఆర్ వరంగల్ కు వస్తున్న నేపథ్యంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డిని హన్మకొండ పోలీసులు గృహనిర్భందం చేశారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశానుసారం అటు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడలిలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ నేతలు కేటీఆర్ పర్యటనను నిరసిస్తూ నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. కే.టి.ఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణిచివేసేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు.

వాస్తవాలను వెల్లడించకుండా ప్రభుత్వం ప్రశ్నించే ప్రతిపక్షాలు గొంతు నొక్కుతున్నారని, పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్లులు, హౌస్ అరెస్ట్ లు చేయడం అప్రజాస్వామిక చర్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపి ప్రజల పక్షాన పోరాడే భాద్యత ప్రతిపక్షాలదన్నారు. ప్రతిపక్షానికి, ప్రజలకు వాస్తవాలు తెలుపకుండా ప్రబుత్వం జవాబు చెప్పకుండా పారిపోతున్నదని, నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష నేతల ఇళ్లల్లోకి ఖాకీలను ఉసిగొల్పుతున్నాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రికి వెన్నులో వణుకుపుడుతొంది. అడుగడుగునా పోలీస్ అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ కేవలం ప్రతిపక్షాలను, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను కట్టడి చేయడానికి వాడుకుంటుంది. ప్రజా సమస్యల పై పోరాటం చేయనియకుండా దొరల పాలన చేస్తూ రాజరికపు పాలన చేస్తూ రాజరికపు పాలన చేయడం సిగ్గుచేట‌న్నారు. నిరసన తెలుపడమే నేరంగా చూస్తున్న ఈ ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా అడ్డుపడుతూ రాక్షస ఆనందం పొందుతున్న కేసీఆర్ దొరల గడి కూల్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప్రజాగ్రహం పెల్లుబికిన నాడు నీ ప్రగతి భవన్ లు, ఫాంహౌస్ లు బద్ధలైపోతాయి. జాగ్రత్త కేసీఆర్ ! అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, జిల్లా ఎన్ఎస్యూఐ అధ్య‌క్షుడు పల్లకొండ సతీష్, ఏఐయూడ‌బ్ల్యూఈసీ అధ్యక్షురాలు గుంటి స్వప్న, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పల్లె రాహుల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు బంక సంపత్ యాదవ్, డివిజన్ కాంగ్రెస్ అద్యక్షులు ఏ. శివాజీ, తక్కలపల్లి మనోహర్, కొండా నాగరాజు, బంక సతీష్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎర్ర మహేందర్, బొంత సారంగం, మదిశెట్టి సతీష్, గణేష్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story