- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇసుక అక్రమ రవాణా పై డేగ కన్ను.!
దిశ, మరిపెడ : ఇసుక అక్రమ రవాణా పై డేగ కన్ను ఉంటుందని ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని మరిపెడ తహశీల్దార్ సైదులు హెచ్చరించారు. మరిపెడ పట్టణ కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో స్థానిక ఎస్సై సతీష్, నరసింహుల పేట ఎమ్మార్వో నాగరాజులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పట్టణాల్లో, గ్రామాల్లో ఏదైనా నిర్మాణ అవసరాలు వుంటే సంబంధిత అధికారులు పంచాయతీ సెక్రటరీ, ఇందిరమ్మ ఇల్లులు ఐతే ఏఈ లను సంప్రదించి ఎన్ని ట్రిప్పుల ఇసుక అవసరమో దరఖాస్తు చేసుకోవాలని అనుమతులు వచ్చాకే ఇసుకను తరలించాలని, అనుమతుల మాటున అక్రమ దందాకు తేరలేపితే ట్రాక్టర్ డ్రైవర్, యజమాని పై కేసులు తప్పవన్నారు.
రాత్రులు ఇసుక అక్రమ రవాణా చేస్తూ డంపులు చేస్తున్నారని అటువంటివి ఏమన్నా ఉన్న మా దృష్టికి తీసుకురావాలని ప్రజలను ఎమ్మార్వో కోరారు. అక్రమ రవాణా జరుగుతుంటే అడ్డుకునే అధికారుల పై దాడులకు తెగబడుతున్నారని అటువంటి వారిపై గట్టి చర్యలు ఉంటాయని తానంచర్లలో ఓ వీఆర్ఏ పై జరిగిన దాడి ఘటనను ఉదహరించారు. దాడి చేసిన వారు కటకటాల పాలయ్యారని గుర్తు చేశారు. రాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవర్లు, సరైన పత్రాలు లేకుండా రోడ్డు ఎక్కిన ట్రాక్టర్ల పై చర్యలు తప్పవు అని అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు రెవెన్యూ, మైనింగ్ అధికారులకు తప్పక సహాయ సహకారాలు అందిస్తామని మరిపెడ ఎస్సై సతీష్ తెలిపారు.