- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాటి నిర్మూలన సామాజిక బాధ్యత.. పక్కా ప్రణాళికతో వెళ్తున్నామన్న డీఎస్‌పీ
దిశ, మరిపెడ: మత్తు పదార్థాలు గుట్కా, గంజాయి, గుడుంబా, అసాంఘిక కార్యక్రమాల నివారణ పైన పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తొర్రూర్ డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు, గుడంబా వల్ల కలిగే నష్టాలు, వాటి కారణంగా యువత, భవిష్యత్తు తరాలపై పడే ప్రభావం గురించి సమాజంలోని అన్ని వర్గాల వారి సహకారంతో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తామని తెలిపారు. మాదకద్రవ్యాల నియంత్రణ కోసం గ్రామాల్లో గంజాయి సాగు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా గ్రామస్తుల మీద కూడా ఉందని, ఇటువంటి చట్ట వ్యతిరేక పనులపై గ్రామస్తులంతా అప్రమత్తమై పోలీసులకు ముందస్తు సమాచారం అందించాలని సూచించారు.
ఎవరైనా మాదకద్రవ్యాల సాగు చేస్తే ప్రభుత్వం అందించే సబ్సిడీలు రద్దు చేసేలా నివేదిక ఇస్తామని తెలిపారు. ఇంటర్, డిగ్రీ, వృత్తి విద్య కాలేజీలు, విద్యా సంస్థల యాజమాన్యాలను, టీచర్లు, లెక్చరర్లు, విద్యార్థులు, గ్రామ సర్పంచులు, మున్సిపల్ కార్పొరేటర్లు, ఆటో, లారీ యూనియన్లతో సమావేశాలు నిర్వహిస్తూ స్థానిక యువత మత్తు పదార్థాలకు ఆకర్షితులు కాకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సింధూర రవి, జెడ్ పి టి సి తేజావత్ శారద రవీందర్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, ఎంపీపీ అరుణ రాంబాబు, వైస్ ఎంపీపీ అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, మరిపెడ తాసిల్దార్ రమేష్ బాబు, మరిపెడ సిఐ ఎన్ సాగర్, ఎస్ ఐ ప్రవీణ్ కుమార్, తో పాటు రెవెన్యూ ,పోలీస్ , ఎక్సైజ్ శాఖ మున్సిపల్, పంచాయతీ రాజ్, శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.