- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అన్నదాతలు అధైర్య పడొద్దు
దిశ,డోర్నకల్ : అన్నదాతలు అధైర్య పడొద్దని, కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఎన్ని అవాంతరాలు ఎదురైనా నెరవేరుస్తుందని ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ రెండు లక్షల రుణమాఫీ జరిపిన ఘనత దేశ చరిత్రలో కాంగ్రెస్కే దక్కుతుందని అన్నారు. రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో ప్రకటించిన విధంగా నెరవేరుస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో చెయ్యలేనిది కాంగ్రెస్ పార్టీ ఏడు నెలల్లో చేసి చూపిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపే రుణమాఫీ చేశారని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ రైతులతో రాజకీయం చేయాలని చూస్తుందని ఆరోపించారు. రైతులెవ్వరూ అధైర్య పడొద్దని, రుణమాఫీ జరగని అర్హులైన రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, ప్రభుత్వం వేలకోట్లు వడ్డీలు కడుతుందని, ఉద్యోగస్తులకు ఫస్ట్ తారీఖున జీతాలు అందజేస్తుంది అన్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఇప్పటి వరకు 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు. తెలంగాణను దేశంలో మొదటి స్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.