- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిశ ఎఫెక్ట్ : జంగాలపల్లిలో రేపు మెడికల్ క్యాంపు
దిశ, ములుగు ప్రతినిధి : గ్రామంలో వరుస మరణాల వెనుక ఉన్న హెల్త్ మిస్టరీని ఛేదించేందుకు ములుగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సన్నద్ధమైంది. ములుగు జిల్లా జంగాలపల్లిలో రెండు నెలల వ్యవధిలో 20 మంది చనిపోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గ్రామానికి కీడు సోకడం.. దెయ్యం పట్టడంతో వరుసగా గ్రామస్థులు అనారోగ్యం పాలవుతూ మరణిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో గ్రామం విడిచి వెళ్తున్న వారు ఉన్నారు. గ్రామస్థుల భయాందోళనపై ఆదివారం దిశ మెయిన్ ఎడిషన్‌లో వార్త కథనం రావడంతో ములుగు జిల్లా యంత్రాంగం కదులుతోంది. జిల్లా కలెక్టర్ దివాకరన్ సూచనలతో వైద్య ఆరోగ్యశాఖ సోమవారం గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహించాలని నిర్ణయించింది. గ్రామస్థులందరికీ వైద్య పరీక్షలు చేయించడం ద్వారా అనారోగ్యానికి గల కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే గ్రామంలో దెయ్యం.. భూతం లేదని, కీడులాంటి మూడ విశ్వాసాలను నమ్మవద్దని పేర్కొంటూ అవగాహన్ కల్పించాలని నిర్ణయించింది.