ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌కు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయండి.. సీఎస్ ఆదేశాలు

by Sumithra |
ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌కు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయండి.. సీఎస్ ఆదేశాలు
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : ఈనెల 8వ తేదీ విచ్చేస్తున్న ప్రధాన మంత్రి మోడీ పర్యటన సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రధాన మంత్రి పర్యటన పై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 8న వస్తున్న ప్రధాని పర్యటన విజయవంతం చేసేందుకు అన్నిశాఖల అధికారులు కచ్చితంగా విధులు నిర్వహించాలన్నారు.

హైదరాబాద్ నుండి నేరుగా ఉదయం 9.35 గంటలకు చేరుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారని అన్నారు. అనంతరం మధ్యాహ్నాం 12.15కి హనుమకొండ నుండి బయలుదేరుతారని అన్నారు. పోలీసు శాఖ తగిన భద్రత, శాంతిభద్రతలు, ట్రాఫిక్‌, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. తగినన్ని అగ్నిమాపక వాహనాలు, పరికరాలు, యంత్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది, అంబులెన్స్‌, ఇతర సౌకర్యాలను సిద్ధంగా ఉంచాలని కోరారు. వేదికల వద్ద అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed