- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బయో మైనింగ్ లో నిర్ధిష్ట లక్ష్యాన్ని పూర్తి చేయండి..
దిశ, వరంగల్ టౌన్: బయో మైనింగ్ ప్రక్రియలో వేగం పెంచి వచ్చే జులై వరకు లక్ష్యాన్ని పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్, ఇంచార్జి జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య, మేయర్ గుండు సుధారాణిలు ఆదేశించారు. సోమవారం బల్దియా పరిధి 46వ డివిజన్ రాంపూర్ డంపింగ్ యార్డ్ లో బయో మైనింగ్ ప్రక్రియ కొనసాగుతున్న పని తీరును మేయర్, కలెక్టర్ లు క్షేత్ర స్థాయి లో పరిశీలించి వేగవంతంగా పూర్తి చేయుటకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు బయో మైనింగ్ ద్వారా చెత్తా నిర్వీర్యం చేస్తున్న రికార్డులను పరిశీలించారు. డంప్ యార్డ్ లో 3 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ఉండగా, ఇప్పటివరకు లక్ష మెట్రిక్ టన్నుల చెత్త బయో మైనింగ్ ద్వారా నిర్వీర్యం చేయడం జరిగిందని అన్నారు.
మిగిలి ఉన్న 2 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వచ్చే జులై నాటికి పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసేలా వేగవంతంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ప్రతిరోజు 1600 మెట్రిక్ టన్నుల చెత్త ప్రాసెసింగ్ జరుగుతున్నదని, షిఫ్ట్ లను , అండ్ మెటీరియల్ పెంచి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ప్రతి నెల 70 వేల టన్నుల చెత్త ప్రాసెసింగ్ లక్ష్యంగా పని చేయాలన్నారు. చెత్త బయో మైనింగ్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా కనీస ప్రమాణాలు పాటించాలని అన్నారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ సరోజన, ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, ఈఈ సంజయ్, స్మార్ట్ సిటీ ప్రతినిధి ఆనంద్ ఓలేటి, ఏఈ వెంకటేశ్వర్లు, సైట్ ఇంజనీర్లు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.