ఆత్మకూర్ PHC ని సందర్శించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్..

by Kalyani |
ఆత్మకూర్ PHC ని సందర్శించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్..
X

దిశ, హనుమకొండ టౌన్: హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమం అమలు తీరును జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం మహిళలకు మాత్రమే ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సాధారణ ప్రసవాలు జరిగేందుకు చర్యలు తీసుకోవాలని డాక్టర్ ను కోరారు. అనంతరం ఆత్మకూర్ మండలంలోని నీరుకుళ్ల గ్రామంలోని కంటి వెలుగు శిబిరం ను సందర్శించారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని వైద్య అధికారిని అడిగారు. తర్వాత నీరుకుళ్ల లోని నర్సరీని పరిశీలించారు. ఏయే రకాల మొక్కలు పెంచుతున్నారు. హరితహారం ప్రణాలిక ఏదీ అని కార్యదర్శిని అడిగారు.

నాటిన మొక్కలకు వారంలో రెండు రోజులు నీళ్లు పోయాలని సూచించారు. సెగ్రిగేషన్ షెడ్ కు కూడా వెళ్లి సేంద్రియ ఎరువు తయారీని పరిశీలించారు. అంగన్వాడీ కార్యకర్తలు పోషణ్ పక్వాడ్ పేరిట చిరుధాన్యాలపై కల్పిస్తున్న అవగాహన తీరును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డీఎం అండ్ హెచ్ఓ డా. సాంబశివరావు, మండల్ స్పెషల్ ఆఫీసర్ రాంరెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీఓ చేతన్ రెడ్డి, పీహెచ్ సీ మెడికల్ ఆఫీసర్ స్పందన తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed