అలాంటి కుటుంబాలకు వెంటనే ప్రభుత్వ సహయం అందాలి.. కలెక్టర్ భవేశ్ మిశ్రా

by Disha News Desk |
అలాంటి కుటుంబాలకు వెంటనే ప్రభుత్వ సహయం అందాలి.. కలెక్టర్ భవేశ్ మిశ్రా
X

దిశ, భూపాలపల్లి: ప్రకృతి వైపరీత్యాల వలన చనిపోయిన వారి కుటుంబాలకు, ఆత్మహత్య చేసుకున్నదిశ, భూపాలపల్లి: ప్రకృతి వైపరీత్యాల వలన చనిపోయిన వారి కుటుంబాలకు, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు సకాలంలో ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందేలా పని చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తహసీల్దార్లను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో తాహశీల్దార్‌‌లతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రకృతి వైపరీత్యాల వలన చనిపోయిన వారి కుటుంబాలకు, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం తరపున నష్ట పరిహారం అందించడంపై సమీక్షించి నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. చనిపోయిన రైతుల కుటుంబాల్లో ఏర్పడ్డ విషాదం తీర్చలేనిదన్నారు. ఆ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటాయని తెలిపారు. అలాంటి కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం తరపున ఆర్ధిక సహయం అందేలా తాహశీల్దార్‌‌లు కృషి చేయాలన్నారు.


Advertisement

Next Story