- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
22 ఏళ్ల కిందట కలిసి చదువుకున్న మిత్రులు.. ఆపదలో ఆదుకున్నరు
దిశ, స్టేషన్ ఘణపూర్: 22 ఏళ్ల కిందట కలిసి చదువుకున్న మిత్రులు.. ఆపదలో ఉన్న తోటి స్నేహితునికి ఆపన్న హస్తం అందించారు. అనారోగ్యం కారణంగా కొంతకాలం నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి లక్ష రూపాయల ఆర్థిక సాయమందించి సహృదయతను చాటుకున్నారు. వివరాల ప్రకారం.. జనగామ జిల్లా చిలుపూర్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన ముమ్మడి రవీందర్ 1999-2000 సంవత్సరంలో అదే మండలంలోని మల్కాపూర్ గ్రామంలో పదోతరగతి వరకు చదివాడు. కార్పెంటర్‌గా స్థిరపడ్డ తర్వాత పెళ్లి చేసుకున్న రవీందర్‌కు ఇద్దరు కుమారులు. అయితే సాఫీగా సాగిపోతున్న వారి జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. రవీందర్ పేగు క్యాన్సర్ బారినపడ్డాడు. ఐదేళ్ల నుంచి ఆస్పత్రుల చుట్టే తిరుగుతుండగా ఏడాదిన్నర కిందట సమస్య తీవ్రతరమైంది. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే విషయం తెలుసుకున్న తన పదోతరగతి బ్యాచ్ మేట్స్.. లక్ష రూపాయలు సేకరించి ఆదివారం గాంధీ ఆస్పత్రిలో అతనికి అందజేశారు.