- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతోంది: మంత్రి సత్యవతి రాథోడ్
దిశ, హన్మకొండ: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతోందని మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. హన్మకొండ హరితా హోటల్ లో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, మేయర్ గుండు సుధారాణిలతో కలసి మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. గవర్నర్ తమిళి సై తెలంగాణ ప్రతినిధిగా సహకరించాలని కోరారు. నీళ్లు, నిధులు, నియమకాలే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని చెప్పారు.
కాళేశ్వరం నీటితో లక్షల ఎకరాలకు సాగు నీరు మిషన్ భగీరథతో తెలంగాణలోని ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తూ ప్రత్యేక నిధులతో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశం లో గవర్నర్ పాల్గొని ఓ వైపు పొగుడుతూనే మరోవైపు విషం చిమ్మారని ఆరోపించారు. విభజన చట్టంలో పొందుపరిచిన కాజిపేట్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదన్నారు.
తెలంగాణకు ద్రోహం చేసిన వారికి గవర్నర్ అపాయిమెంట్ ఇస్తుందని ఆరోపించారు. యువతకు రాజ్ భవన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన మాట వాస్తవమే అయితే, కేంద్ర ప్రభుత్వ అన్యాయాలను అడ్డుకొని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ గవర్నర్ కు 3 పేజీల లేఖను పంపిస్తున్నట్లు ఆమె తెలిపారు.