గెలుపు ఓటములు సహజం.. ప్రజా తీర్పును గౌరవిస్తున్నా.. మాజీ మంత్రి

by Sumithra |
గెలుపు ఓటములు సహజం.. ప్రజా తీర్పును గౌరవిస్తున్నా.. మాజీ మంత్రి
X

దిశ, పాలకుర్తి : గెలుపు ఓటములు సహజమని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ బాధపడి అదైర్య పడొద్దని నియోజకవర్గ ప్రజా సమస్యల పై పోరాటం కొనసాగుతుందని అన్నివేళలా పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, అండగా ఉంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. శనివారం పాలకుర్తి నియోజకవర్గంలో పాలకుర్తి, కొడకండ్ల, పెద్దవంగర, తొర్రూరు, రాయ‌ప‌ర్తి మండల కేంద్రాల్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని గత రెండు పర్యాయలు రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమమే ద్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన సాధించిందని పాలకుర్తి నియోజకవర్గంను అన్నివిధాలా అభివృద్ధి చేశానని తెలిపారు.

ప్రజా తీర్పును గౌరవిస్తున్నా రాజకీయాలలో గెలుపోటములు సహజం, అధికారంలో లేకపోయినా ప్రజాసమస్యల పట్ల పోరాటం కొనసాగిస్తూ పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగేలా పోరాటం చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతీ కార్యకర్తకు అభినందనలు తెలిపారు. పదవిలో ఉన్నా లేకపోయినా నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కష్ట సుఖాలలో అండగా ఉంటానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల మండల పార్టీల అధ్యక్షులు ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed