సోషల్ మీడియానే మన ఆయుధం.. బీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ సతీష్ రెడ్డి..

by Sumithra |
సోషల్ మీడియానే మన ఆయుధం.. బీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ సతీష్ రెడ్డి..
X

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : సోషల్ మీడియానే బీఆర్ఎస్ పార్టీకి వజ్రాయుధమని ఆ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్, రెడ్ కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నియోజకవర్గ సోషల్ మీడియా సమావేశం ఎమ్మెల్యే శంకర్ నాయక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ మనుష్యుల సంఖ్య కన్నా, వాడుతున్న స్మార్ట్ ఫోన్ లే ఎక్కువ అని అన్నారు. సోషల్ మీడియాను వినియోగించుకుంటే, ప్రతి మనిషికి నేరుగా సమాచారం అందించవచ్చని సూచించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. మానుకోట నియోజకవర్గం తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. యుద్దం చేయాల్సిన సమయం వచ్చింది, సోషల్ మీడియా వారియర్స్ సిద్ధంగా ఉండాలన్నారు. పలువురికి ట్యాబ్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు యాళ్ల మురళీధర్ రెడ్డి, పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, ఫరిద్, చిర్ర యాకాంతం గౌడ్, సుమన్, రాహుల్, నరేశ్ ప్రియాంక, నజీర్, వీరస్వామి పాల్గొన్నారు.

Advertisement

Next Story