ఘనంగా BRS Party ఆవిర్భావ వేడుకలు

by Sumithra |   ( Updated:2022-12-10 12:26:17.0  )
ఘనంగా BRS Party ఆవిర్భావ వేడుకలు
X

దిశ, నర్సంపేట : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ వేడుకలు నర్సంపేట పట్టణంలోని అమరవీరుల కూడలి వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజనీకిషన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ప్రజాసంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయుటకు బీఆర్ఎస్ పార్టీ నిర్మాణం అయిందన్నారు. ఉద్యమ స్పూర్తి దేశ వ్యాప్తం అవుతున్నదని హర్షం వ్యక్తం చేశారు. ప్రజారంజక పాలన కేసీఆర్ తోనే సాధ్యమని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నల్ల మనోహర్ రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి, పట్టణ కార్యదర్శి వెన్నుముద్దుల శ్రీధర్ రెడ్డి, కౌన్సిలర్స్ దార్ల రమాదేవి, జురు రాజు, రాయుడి కీర్తి, గంధ రజిత, చంద్రమౌళి దేవుడు, తిరుమల సదానందం, మాజీ మండల అధ్యక్షుడు మచిక నరసయ్య, ఎంపీటీసీ వీరన్న, సర్పంచ్ కడారి రవి, యువజన సంఘం అధ్యక్షుడు రాయుడు దుష్యంత్ రెడ్డి , మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఇర్ఫాన్, వార్డు అధ్యక్షులు రాయరాకుల సారంగం, దొంగల సురేష్, సాలయ్య బాబు, పెరుమాండ్ల రవి , శివకోటి, మహిళా అధ్యక్షురాలు వాసం కరుణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొమ్ముల కరుణాకర్, బీసీ సెల్ అధ్యక్షుడు పుల్లూరు స్వామి, గ్రంథాలయం జిల్లా డైరెక్టర్ పుట్టపాక కుమారస్వామి, చుక్కా అనిల్, మంద ప్రసాద్, బైరి మురళి, అప్పల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed