మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ నాయకుల ధర్నా

by S Gopi |   ( Updated:2022-12-23 15:08:17.0  )
మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ నాయకుల ధర్నా
X

దిశ, మహబూబాబాద్ టౌన్: జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్లో శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు స్థానిక మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ రాష్ట్రానికి రావాల్సిన నిధులను రానివ్వకుండా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు, సీనియర్ నాయకులు, కౌన్సిలర్ మార్నేని వెంకన్న, ఊకంటి యాకూబ్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, టౌన్ అధ్యక్షుడు గద్దె రవి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు యాకుబ్ పాషా, వెంకట్ రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శ్రీనివాస్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లూనావత్ అశోక్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed