- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విధి నిర్వహణలో వివక్షకు గురవుతున్నా: వైద్య అధికారి వేణుమాధవ్ రావు
దిశ, డోర్నకల్: విధి నిర్వహణలో వివక్షకు గురవుతున్నానని డోర్నకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారి వేణుమాధవ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. వేణుమాధవ్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. ‘ నాకు బాధ్యతలు అప్పగించమని అడిగినందుకు ఇంచార్జి మెడికల్ ఆఫీసర్ ఉమా గౌరీ నా విధులకు ఇబ్బందులు కలగజేస్తున్నారు. వేణుమాధవ్ కు సహకరించవద్దని ఆయన అసలు డాక్టరే కాదని ఆసుపత్రి సిబ్బందికి చెబుతున్నారు. ఇటీవల డీఎం అండ్ హెచ్ఓ కార్యాలయంలో అధికారుల ముందే నువ్వు ఎంత నీ బతుకెంత.. వేలు విరగొడుతానంటూ తీవ్రంగా అవమానించింది. ఫోన్ కాల్స్ చేసి రెక్కలు విరిచేస్తానంటూ దుర్భాషలాడింది.చీటీకి మాటికి డిపిటేషన్ ఆర్డర్, చార్జ్ మెమోలు, మెమోలు జారీ చేస్తుంది’ అని ఆరోపించారు.
తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లో చేరి నెలలు గడుస్తున్నా సీటీసీ మీద కూడా సంతకం పెట్టలేదని తెలిపారు. క్రమం తప్పకుండా విధులు నిర్వహిస్తున్నా జీతం వేయడం లేదన్నారు. శాలరీ ఎందుకు వేయడం లేదని అడిగితే నా ఇష్టం నువ్వేం చేస్తావు అని వేధిస్తుందని వేణుమాధవ్ రావు ఆరోపించారు. ఉన్నతాధికారులు పూర్తి స్థాయి విచారణ జరిపి అధికారినిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
డిప్యూటీ డీఎంహెచ్ఓ ఉమా గౌరీ వివరణ..
విధులు సక్రమంగా నిర్వహించకపోవడం, శాలరీకి సంబంధించిన నకిలీ పత్రాలు సమర్పించడం వలన మెమో జారీ చేసినట్లు తెలిపారు. సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తాడని అన్నారు. ఆయనను డీఎంహెచ్ఓ ఆఫీస్ కు సరెండర్ చేసినట్లు పేర్కొన్నారు.