భక్తులపై తేనెటీగల దాడి..

by Kalyani |
భక్తులపై తేనెటీగల దాడి..
X

దిశ, వేలేరు: వేలేరు మండల పరిధి మల్లికుదుర్ల గ్రామ శివారులో గట్టు మల్లికార్జున స్వామి దేవాలయ ఆవరణలో పూజలు నిర్వహిస్తున్న భక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో దాదాపు పదిమంది భక్తులు గాయపడ్డారు. కాగా గాయపడిన పదిమంది భక్తులు ఒకే కుటుంబానికి చెందినవారు. వెంటనే స్పందించిన స్థానికులు 108 కు ఫోన్ చేయడంతో 108 సిబ్బంది వచ్చి గాయపడిన వారందరికి ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఎంజీఎంకు తరలించారు.

Advertisement

Next Story