వడదెబ్బపై అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్ సీహెచ్. శివలింగయ్య

by Kalyani |
వడదెబ్బపై అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్ సీహెచ్. శివలింగయ్య
X

దిశ, జనగామ: వేసవి కాలంలో వడదెబ్బపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సీహెచ్. శివలింగయ్య సూచించారు. గురువారం కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రోజు రోజుకు ఎండలు పెరుగుతున్నందున ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. వడదెబ్బ కారణంగా శరీర ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడం, తీవ్రమైన తలనొప్పి, నాడి వేగంగా కొట్టుకోవడం, శరీరంలోని నీటి శాతం కోల్పోవడం, నాలుక ఎండిపోవడం లాంటి లక్షణాలు ఉన్నట్లయితే సన్ స్ట్రోక్ గురైనట్లు గ్రహించాలని తెలిపారు.

వడదెబ్బ తగిలిన వారిని ముందుగా నీడలోకి తీసుకెళ్లడం, ఆ వ్యక్తి పాదాలను ఎత్తులో పెట్టే విధంగా చూడాలని, అలాగే చల్లని నీరు తాగించడం, చల్లని నీటిలో ముంచిన గుడ్డతో శరీరమంతా తుడువడం, మెడ, చాతిపై ఐస్ ప్యాక్స్ తో అమర్చడం చేసి, ఫ్యాన్ గాలి తగిలే విధంగా వ్యక్తిని ఉంచడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రజలు ఎండ దెబ్బ తగలకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా శీతల పానీయాలు సేవించాలని, తరచుగా మంచినీళ్లు అధికంగా తాగాలని అన్నారు. ఎండలోకి సాధ్యమైనంతవరకు వెళ్లరాదని, తప్పనిసరి వెళ్ళవలసి వస్తే గొడుగులు, తలపాగా, టోపీలు ధరించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed