తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

by Sridhar Babu |
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ
X

దిశ,నెక్కొండ : తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ అని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. తెలంగాణ ఆడపడుచుల అపూర్వ పండుగ బంతుకమ్మ సందర్భంగా వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చంద్రుగొండ గ్రామానికి చెందిన బక్కి ఎల్లయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు బక్కి అశోక్ కవిత, రాజేందర్, నరేష్ కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ పండుగరోజు విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషకరమన్నారు. ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్లు రావుల హరీష్ రెడ్డి, పాల్వాయి శ్రీనివాస్, టౌన్ ప్రెసిడెంట్ హరిప్రసాద్, రామాలయ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షుడు గోక అనిల్, నాయకులు ప్రశాంత్, చెన్నకేశవులు, లక్ష్మణ్, సురేష్, సాంబయ్య పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed