- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంట రవి కుమార్ ను పరామర్శించిన బండి సంజయ్..
దిశ, ఖిలా వరంగల్: వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా వరంగల్ తూర్పుకు విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మొదటగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఇంటికి వెళ్లి అల్పాహారం చేశారు. తదనంతరం వరంగల్ తూర్పు బీజేపీ నాయకులు గంట రవి కుమార్ కొద్ది రోజులుగా తొంటిసమస్య (avn) తో బాధపడుతున్నారని తెలుసుకొని గంట రవిని పరామర్శించాడానికి వరంగల్ శివనగర్ లోని గంట రవికుమార్ స్వగృహానికి ఆయన చేరుకుని గంట రవిని పరామర్శించారు. ఆరోగ్య సమస్యను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ గంట రవి కుమార్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నియోజకవర్గ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే నాయకుడు అనారోగ్యం బారినపడడం బాధాకరమన్నారు. బీజేపీ పార్టీ ప్రతీ నాయకుడికి, కార్యకర్తకు అండగా ఉంటుందని చెప్పారు. బండి సంజయ్ తో పాటు పరామర్శించిన వారిలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మురళీధర్ గౌడ్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, బీజేపీ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు తదితరులు ఉన్నారు.