- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెవెన్యూ అధికారులకు, రైతులకు మధ్య వాగ్వాదం..
దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా ములుగు మండలం ఇంచర్ల గ్రామ సమీపంలోని ఎర్రి గట్టమ్మ వద్ద రెవెన్యూ అధికారులకు,రైతులకు మధ్య ప్రభుత్వ భూమి విషయమై తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. బుధవారం ములుగు మండలం ఇంచర్ల గ్రామం సమీపంలో ఎర్రి గట్టమ్మ వద్ద ప్రభుత్వ భూమిలో వేయడానికి వెళ్లిన రెవెన్యూ అధికారులను స్ట్రెంచ్ వేయడం ఆపాలని స్థానిక రైతులు అడ్డుకోగా కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
ములుగు మండలం ఇంచర్ల ఎర్రి గట్టమ్మ సమీపంలోని సర్వే నెంబర్లు 18,19,20,22,23,24,28,29,30 లో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం స్ట్రెంచ్ కొట్టడానికి జేసీబీ లతో వెళ్లిన రెవెన్యూ శాఖ అధికారులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. రైతులకు రెవెన్యూ అధికారులకు మధ్య కొంచెంసేపు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గత ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చిన భూములను రెవెన్యూ అధికారులు దౌర్జన్యంగా లాక్కుంటున్నారని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తు అధికారులతో వాగ్వాదానికి దిగారు.