- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యథేచ్ఛగా మట్టి దందా.. చోద్యం చూస్తున్న అధికారులు
దిశ, కమలాపూర్ : మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా మట్టి వ్యాపారులు ఎవరికి తోచినంత వారు మట్టి తోడేస్తు రవాణా చేస్తూ లక్షల్లో వ్యాపారం చేసి కాసులు దండుకుంటున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో సంబంధిత అధికారులు ఎవరు ఉండరు అనే ధైర్యంతో జేసీబీ లతో పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని చెరువులో ఇటు కమలాపూర్,అటు ఉప్పల్ వైపు రెండు, మూడు జేసీబీ లతో ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. వర్షాకాలం రానుండడంతో మట్టి లభించకపోవచ్చు అనే భావనతో ముందస్తుగానే డిమాండ్ ఉండడంతో మట్టి వ్యాపారులు ఒక్కో ట్రిప్పుకు రూ. 500, నుంచి రూ. 600 వరకు డిమాండ్ చేస్తూ మట్టి వ్యాపారస్తులు కాసులు దండుకుంటున్నారు. ఎన్నోసార్లు పత్రికల్లో కథనాలు వెలువడిన అధికారుల్లో చలనం లేకపోవడంతో చూసిన వారంతా అధికారుల చర్యలు ఏమంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ మట్టి దందా పై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుని కట్టడి చేయాలని పలువురు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.