వరంగల్ కమిషనరేట్ పరిధిలో మరో ఎస్సై సస్పెన్షన్

by samatah |
వరంగల్ కమిషనరేట్ పరిధిలో మరో ఎస్సై సస్పెన్షన్
X

దిశ, హనుమకొండ టౌన్ : వరంగల్ కమిషనరేట్ పరిధిలో మరో పోలీస్ ఆఫీసర్ పై వేటు పడింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఎస్సైని సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే ఎన్. రాజారావు నల్లబెల్లి సబ్ ఇన్ స్పెక్టర్‌గా పని చేస్తున్నాడు. ఈయన పై అవినీతి ఆరోపణలు రావడంతో సీ.పీ. ఏ.వీ రంగనాథ్ విచారణ చేపట్టారు. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో గురువారం సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Next Story