ఘనంగా ‘రైజింగ్ సన్ టాలెంట్ మోడల్ స్కూల్’ వార్షికోత్సవ వేడుకలు..

by Kalyani |
ఘనంగా ‘రైజింగ్ సన్ టాలెంట్ మోడల్ స్కూల్’ వార్షికోత్సవ వేడుకలు..
X

దిశ, మరిపెడ (చిన్నగూడూర్): చిన్నగూడూరు మండల కేంద్రంలోని రైజింగ్ సన్ టాలెంట్ మోడల్ స్కూల్ లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని స్కూల్ యాజమాన్యం ప్రారంభించింది. అనంతరం రైజింగ్ సన్ కరెస్పాండెంట్ కాలు నాయక్ మాట్లాడుతూ చిన్నగూడూర్ మండలంలో నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో బ్రాంచీని ఏర్పాటు చేశామని, మా మీద నమ్మకంతో సంవత్సరం లోపలే 400 అడ్మిషన్లు రావడం చాలా ఆనందాన్నిచ్చిందని చెప్పారు.

నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోమని గత 13 సంవత్సరాల నుంచి 900 మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నామని వారికి ఒక చదువు నేర్పడమే కాకుండా, సమాజంలో ఎలా మెలగాలనే అంశాలపై పూర్తి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కాగా ఈ సందర్భంగా నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రైజింగ్ సన్ ప్రిన్సిపల్ సంతోష అబ్రహం, ఎస్ కే అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed