అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం బంద్..

by Sumithra |
అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం బంద్..
X

దిశ, కాటారం : అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు పంపిణీ పౌష్టికాహార నిల్వలు లేవు. రెండు మూడు నెలలుగా పలు అంగన్వాడి కేంద్రాలకు కందిపప్పు సరఫరా నిలిచిపోయింది. స్టాక్ లేని కారణంగా నెల రోజులుగా పౌష్టికాహారం గర్భిణీ , బాలింత మహిళలకు పంపిణీ జరగడం లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. నడిచిన రెండు మూడు నెలలుగా పప్పు, టెట్రా పాలు సరఫరా సక్రమంగా జరగడం లేదు. మాత శిశు మరణాలను గణనీయంగా తగ్గించి సంపూర్ణ ఆరోగ్య సమాజానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. కానీ సంబంధిత అధికారుల ముందుచూపు కొరవడి లక్ష్యానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. నేత్ర స్థాయిలో పప్పు పాలు సక్రమంగా అందడం లేదని ఆరోపణలు ఉన్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా పంపిణీకి ఒకే కాంట్రాక్టర్..

అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన సరుకుల సరఫరా ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా ఒకే కాంట్రాక్టర్కు ప్రభుత్వం కొన్ని ఏళ్లుగా అప్పగించింది. హైదరాబాదు నుండి పర్యవేక్షణ , టెండర్ల ఖరారు ప్రక్రియ, సరుకుల సరఫరా ప్రక్రియ జరుగుతోంది. కాంట్రాక్టర్ టెండర్ల గడువు ముగిసి కొత్త టెండర్లు ఖరారు చేయడంలో తీవ్ర జాబితా ఏర్పడడంతో సరుకుల సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో తగిన ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రస్థాయి అధికారుల నుంచి జిల్లా కేంద్రానికి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు అలాంటి ఏర్పాట్లు ఉమ్మడి జిల్లాలో పూర్తి కాకపోవడం కొన్ని రోజులుగా అంగన్వాడి కేంద్రాలకు పప్పు సరఫరా నిలిచిపోయింది. గతంలో జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ చైర్మన్గా పలువురు ఉన్నతాధికారులు కమిటీ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన సరుకులు కొనుగోలు సరఫరా ప్రక్రియ సాఫీగా జరిగేది.

విధానానికి స్వస్తిపరికి రాష్ట్ర స్థాయిలో ఒకే కాంట్రాక్టర్కు అప్పచెప్పారు. మళ్లీ పాత పద్ధతి అవలంబించేందుకు జిల్లా స్థాయిలో కొనుగోలు కమిటీ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ జిల్లాస్థాయిలో పూర్తిగా కార్యారూపం దాల్చలేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహాదేవపూర్ భూపాలపల్లి దాన్లో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఉండగా 644 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో మూడు నుంచి ఆరేళ్లలోపు కేంద్రాలకు హాజరయ్యే చిన్నారులు 9,259 , గర్భిణీలు బాలింతలు కలిపి మరో 5036 మంది ఉన్నారు. ఆరోగ్య లక్ష్మీ పథకం కింద గర్భిణీలు బాలింతలకు రోజు మధ్యాహ్న భోజనంలో 30 గ్రాములు కేంద్రాలకు వచ్చే చిన్నారులకు 15 గ్రాములు చొప్పున పప్పు వినియోగిస్తారు. గర్భిణీలు బాలింతలకు రోజు 200 మిల్లీలీటర్ల పాలు ఇస్తారు.

ప్రత్యామ్నాయ చర్యలు చేపడతాం.. టి. శైలజ మహిళా శిశు అభివృద్ధి శాఖ భూపాలపల్లి జిల్లా సంచాలకులు..

జూన్ నెలలోనే కందిపప్పు కేంద్రాలకు సరఫరా కాలేదు. రాష్ట్రస్థాయిలో టెండర్ల ప్రక్రియ పూర్తి కాగానే కందిపప్పు సరఫరా చేస్తాం. జిల్లాస్థాయిలో ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నాము. అధిక రేట్లు ఉండడం కేంద్రాలకు ట్రాన్స్పోర్ట్ చేయడంలో ఇబ్బందులు ఉండడంతో ఈ నెలలో కందిపప్పు అందించలేకపోయాం. ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా టెండర్లు ఖరారు కాగానే అనుగుణంగా జిల్లాలో అమలుపరుస్తాం.

Advertisement

Next Story

Most Viewed