షార్ట్ స‌ర్య్కూట్‌తో అంబులెన్స్ దగ్ధం..?

by Kalyani |
షార్ట్ స‌ర్య్కూట్‌తో అంబులెన్స్ దగ్ధం..?
X

దిశ, ఏటూరు నాగారం: షార్ట్ స‌ర్క్యూట్ తో 108 అంబులెన్స్ ద‌గ్ధం అయిన ఘ‌ట‌న ములుగు జిల్లా తాడ్వాయి మండ‌ల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుప‌త్రిలో జ‌రిగింది. స్థానికుల వివ‌రాల ప్రకారం.. మంగ‌ళ‌వారం అర్దరాత్రి 2 గంట‌ల స‌మ‌యంలో తాడ్వాయి ప్రభుత్వ ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో పార్క్ చేసి ఉంచిన అంబులెన్స్ షార్ట్ స‌ర్య్కూట్‌తో ద‌గ్ధం అయింది. ఆసుప‌త్రి సిబ్బంది ఉద‌యం చూసే స‌రికి అంబులెన్స్ పూర్తిగా కాలిపోయి ఉంది.

కాగా ఇట్టి ఘటనపై స్థానిక తాడ్వాయి ఎస్ఐ వెంకటేశ్వర్ రావును దిశ ఫోన్‌ ద్వారా సంప్రందించ‌గా కాలిపోయిన మాట వాస్తవ‌మే కానీ, మాకు ఇప్పటివరకు వ‌ర‌కు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వెల్లడించారు. అంబులెన్స్ ద‌గ్ధం అయి సుమారు 13 గంట‌లు కావాస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి పిర్యాదు చేయ‌క‌పోవ‌డంతో నిజంగా షాక్ స‌ర్య్కూట్‌తో కాలిపోయిందా..? ఎవ‌రైనా ఉద్దేశ పూర్వకంగానే అంబులెన్స్ కాల్చివేశారా..? అనే అనుమానాలు స్థానిక ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed