అంబేద్కర్‌ ఆలోచనా విధానం నేటి తరానికి ఆదర్శం: ఎమ్మెల్యే ఆరూరి

by Kalyani |   ( Updated:2023-04-13 11:05:26.0  )
అంబేద్కర్‌ ఆలోచనా విధానం నేటి తరానికి ఆదర్శం: ఎమ్మెల్యే ఆరూరి
X

దిశ, హనుమకొండ టౌన్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆలోచనా విధానం నేటి తరానికి ఆదర్శమని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 43వ డివిజన్ జక్కాలోద్దిలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

అనంతరం ఎంపీ సంతోష్ పిలుపు మేరకు అంబేద్కర్ విగ్రహం వద్ద మొక్కను నాటారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్‌ విశేష కృషి చేశారని తెలిపారు. న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘసంస్కర్తగా విభిన్న పాత్రలు పోషించిన మహా నాయకుడు అంబేద్కర్‌ అని కొనియాడారు. అంబేద్కర్ చూపిన మార్గాన్ని అనుసరిస్తూ వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story