పత్రికా ప్రపంచంలో 'దిశపత్రిక' అగ్రభాగాన నిలిచింది.. ఏసీపీ రఘు‌చందర్

by Disha News Desk |
పత్రికా ప్రపంచంలో దిశపత్రిక అగ్రభాగాన నిలిచింది.. ఏసీపీ రఘు‌చందర్
X

దిశ, స్టేషన్ ఘన్ పూర్: అనతికాలంలోనే అనేక సంచలనాత్మక వార్తాకథనాలను అందిస్తూ అగ్రభాగాన నిలిచిన దిశ రానున్న రోజుల్లో మరింత ఎదగాలని స్టేషన్ ఘన్‌పూర్ ఏసీపీ రఘు చందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం దిశ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండేళ్ల ప్రయాణంలో దిశ పత్రిక ఇతర పత్రికలకు దీటుగా సందేశాత్మక, సంచలనాత్మక వార్తలను అనుదినం లక్షలాది మందికి చేరుస్తూ పత్రికా ప్రపంచంలో అగ్రభాగాన నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ ఎడవెల్లి శ్రీనివాస రెడ్డి, జఫర్‌గడ్ ఎంపీపీ రడపాక కడప సుదర్శన్, హిమ్మత్ నగర్ సర్పంచ్ తాటికాయల అశోక్, మార్కెట్ డైరెక్టర్ జొన్నల సోమన్న, మార్కెట్ సిబ్బంది విజయ్, ప్రవీణ్, హరీష్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Next Story