ఎస్సారెస్పీ కాల్వలో యువకుడు గల్లంతు..

by Sumithra |
ఎస్సారెస్పీ కాల్వలో యువకుడు గల్లంతు..
X

దిశ, పెద్దవంగర : మండల కేంద్రంలోని గట్లకుంట సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వలో చరణ్ (30)అనే యువకుడు శుక్రవారం గల్లంతయ్యాడు. పూర్తివివరాలోకి వెళితే హన్మకొండ కాజీపేటకు చెందిన చరణ్ గట్లకుంట గ్రామ శివారు అమర్సింగ్ తండాలో బంధువుల చావుకు వచ్చాడు.

అక్కడ దహన సంస్కారాలు అయిన తరువాత చరణ్ స్నానం చేయడానికి ఎస్సారెస్పీ కాల్వ వద్దకు చేరుకున్నాడు. స్నానం చేస్తున్న సమయంలో కాలు జారడంతో కాల్వలో పడి గల్లంతయ్యాడు. చరణ్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గల్లంతయిన యువకుడికి భార్య ఉంది.

Advertisement

Next Story