- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అద్భుతం.. అపూర్వం పూర్వవిద్యార్థుల సమ్మేళనం..
దిశ, ఖిలావరంగల్ : వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఖిలా వరంగల్ హై స్కూల్ లో 1978 - 79 విద్యా సంవత్సరంలో పదోతరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం పూర్వవిద్యార్థుల సమ్మేళనాన్ని వైభవంగా నిర్వహించారు. 44 సంవత్సరాల తర్వాత ఒకే చోట తమ కుటుంబసభ్యులతో కలిసి సమావేశం అయ్యారు. ఆనాడు కలిసి చదువుకున్న పూర్వవిద్యార్థులు తాము యేయే రంగాలలో ఉన్నారో, తమ పిల్లలు తమ కుటుంబాన్ని నేపథ్యాన్ని ఒక్కరొకరుగా వివరించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఆనాటి పాఠశాల ఉపాధ్యాయులను స్మరించుకోవడమే కాకుండా వారిని ఘనంగా సన్మానించి సత్కరించారు. వారికి పాదాభివందనాలు చేశారు.
అనంతరం పూర్వవిద్యార్థులు, ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులు అంతా కలిసి భోజనం చేశారు. తాము 44 సంవత్సరాల క్రితం చదువుకున్న పాఠశాల అభివృద్ధి కోసం తమవంతు సహాయం అందించారు. ప్రతి ఏటాఇలాగే కలుసుకోవాలని పూర్వవిద్యార్థులు తీర్మానించారు. అనంతరం ఆటపాటలతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ బాధ్యులు, అధ్యక్షులు బండి కోటేశ్వరరావు, బెల్లంకొండ రమేష్, వేల్పుల రవీందర్, పాలకుర్తి సత్యనారాయణ, గుర్రం రవీందర్ బాబు, నాగవెల్లి సుదర్శన్, తాళ్లపల్లి రవీందర్, సంపత్ కుమార్ లతోపాటు ఆనాడు తమకు పాఠాలు నేర్పిన ఉపాధ్యాయులు నాగభూషణం, ఉపేందర్, మొగిలి, ఐలయ్య, వెంకట్రావు, నరసయ్య, శైలేందర్, వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.